Sat Dec 13 2025 19:19:29 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ ఘాట్ వద్ద జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్ది సేపటి క్రితం ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్ది సేపటి క్రితం ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనో వర్ధంతి కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్ధనలను నిర్వహించారు.
కుటుంబ సభ్యులతో కలసి....
వైఎస్సార్ సతీమణి విజయమ్మతో పాటు జగన్ భార్య భారతి ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్దకు అనేక మంది పార్టీ నేతలు వచ్చి వైఎస్ కు నివాళులర్పించారు. జగన్ మూడు రోజుల నుంచి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు ఆయన ఈరోజు విజయవాడకు చేరుకునే అవకాశముంది.
Next Story

